ప||నా జీవిత వ్యధలందు -యేసే  జవాబు

 యేసే జవాబు -ప్రభు యేసే జవాబు  

1.తీరని మమతలతో -ఆరని మంటలతో

ఆశ నిరాశలతో-తూలెను నా బ్రతుకే

అ ప ||నను గని వచ్చెను -తన కృప  నిచ్చెను

కరుణతో ప్రేమించి -కలుషము బాపెను  

2. చీకటి వీధులలో -నీటుగా నడచితిని

లోకపుటుచ్చులలో -శోకము జూచితిని || అ  ప||

౩. ద్రో హుల నమ్ముకుని -స్నేహము చేసితిని

ఇడుముల పాల్జేసి -ఎడ బాసిరి నన్ను|| అ ప||

4.  హంగుల వేషముతో -రంగుల వలయములో

నింగికి నేనెగిరి -నేలను రాలితినే || అ ప||