పల్లవి: నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా – నేను సాగి వెళ్ళేదను (2X)

సాతనును పార ద్రోలెదను – క్రీస్తులో జయించెదను (2X)

నే క్రీస్తులో జయించెదను – నే క్రీస్తులో జయించెదను

అఅహా అఅహా హల్లెలూయ (3X) హల్లెలూయ హల్లెలూయ

1. శత్రు సమూహము నను చుట్టినా – లోకము నన్ను నిందించినా (2X)

యెహోవ నిస్సీ నా ధ్వజము – నాకు తోడై జయ మిచ్చును (2X)

నాకు తోడై జయ మిచ్చును  (సాతనును పార ద్రోలెదను)

2. శోధన సంద్రము వలె పొంగినా – వ్యాధిబాధలు కృంగ  దీసినా (2X)

యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X)

స్వస్థత నిచ్చి నడిపించును (సాతనును పార ద్రోలెదను)

3.  ధన సంపదలు నను విడచినా – బంధు మిత్రులు నను మరచినా (2X)

యెహోవ రోఫీ నా కాపరి – నన్ను కాచి నడిపించును (2X)

నన్ను కాచి (సాతనును పార ద్రోలెదను)