నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా /2/

నీవు పలికితే నాకు మేలయ్యా ||2|| నీ దర్శనమే నాకు చాలయ్యా /2/నాతో/

నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది /2/నీవు పలికితే/

నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది  /2/నీవు పలికితే/

నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో నాకు వెలుగిచ్చేది /2/నీవు పలికితే/