నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు 

శిల్పి చేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము 

1. అంధకార లోయలోన – సంచరించిన భయములేదు 

నీవాక్యం శక్తికలది – నాత్రోవకు నిత్యవెలుగు 

2. ఘోరపాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని 

లెవనెత్తుము – శుద్ధి చేయుము – పొందనిమ్ము నీదు ఆత్మను 

3. ఈభువిలో రాజునీవే – నాహృదిలో శాంతి నీవే 

కుమ్మరించుము నీదుఆత్మను – జీవితాంతము నీ సేవచేయగా