నీ జీవితంలో గమ్యంబు ఏదో – ఒకసారి యోచించవా 

ఈనాడె నీవు ప్రభుయేసు కొరకు – నీ హ్రుదయమర్పించవా

1. నీ తల్లి గర్భాన నీవుండినపుడే – నిను చూచె ప్రభు కన్నులు 

యోచించినావ ఏ రీతి నిన్ను – నిర్మించె తన చేతులు 

2. తన చేతులందు రుదిరంపు ధారల్ – ప్రవహించె నీ కోసమే 

భరియించె శిక్ష నీకోసమేగా – ఒకసారి గమనించవా 

3. నీలోన తాను నివసింప గోరి – దినమెల్ల చేజాచెను 

హ్రుదయంపు తలుపు తెరువంగలేవా – యేసు ప్రవేశింపను 

4. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి – సమయంబు ఈనాడెగా 

ఈ చోటునుండి ప్రభుయేసు లేక – పోబోకుమో సోదరా/సోదరి