నీ కనుదృష్టి నాపైవుంచి – నీకనుపాపవలె నను కాపాడిన కరుణామయా /2/

కంటికి రెప్పలా కాచిన దేవుడా – కునుకక నిద్రించక కాచినా దేవుడా /2/

నీకే స్తోత్రము – నీకే స్తోత్రము – నీకే స్తోత్రము – నీకే స్తోత్రము /2/కంటి/

1. ఎవరు తీయలేని – నీకంచె నాచుట్టూ ప్రాకారముగా వుంచావయా 

నా బలహీనతలో నాబలము నీవై – నా భయములన్నిటిని తీసావయా /2/

ఏ అపాయమైనను దరి చేరనీయక – ఏ శత్రువైనను నను తాకనీయక /2/ 

నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా – నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/

2. ఎవరు ఇవ్వలేని నీరక్షణ నాకిచ్చి – నీ జీవ గ్రంధములో నాపేరు వుంచావు 

నీ అగ్ని నాచుట్టూ సరిహద్దు వేసి – పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు/2/ 

ఏ అపాయమైనను దరి చేరనీయక – ఏ శత్రువైనను నను తాకనీయక /2/ 

నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా – నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/