నీ కృపను గూర్చి నే పాడేద నీ ప్రేమను గూర్చి ప్రకటించెద#2# 

నిత్యము నే పాడెద – నా ప్రభుని కొనియాడెద #2#

మహిమ ఘనత ప్రభావము చెల్లించెద #2# 

1.ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా 

నిందలో అపనిందలో – నాకు తోడూ నీడగా#2# 

నా యేసు నాకుండగా – నా క్రీస్తే నా అండగా#2#

భయమా దిగులా మనసా నీకెలా#2# నీ కృపను#

2.వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన 

మరణమై బలియాగమై – నన్ను విడిపించినా #2#

నా యేసు నాకుండగా – నా క్రీస్తే నా అండగా #2#

భయమా దిగులా మనసా నీకెలా #2# నీ కృపను#