నీ ప్రేమ ఎంతో అపారము – వర్ణించ తరమా నా ప్రభు

పులకింప చేసెను నా హృది – హృదయేశ్వరా నా యేసువా (2)

1. నన్ను ఎంతో ప్రేమించి – నాదు పాపము క్షమియించి

కృప కనికరముల నీడలో – నన్ను చేర్చిన నా ప్రభూ

జీవితమంతా స్తుతించినా – తీరునా రుణం….. తీరునా రుణం…..

2. నీదు సన్నిధి కాంక్షించి – పాప బ్రతుకే వీడితిని

    నీదు జీవమే నిండుగా – నాలో నింపుము నా ప్రభు

    జీవితమంతా నీ ప్రేమన్ – చాటు చుందును… చాటు చుందును…

3. సముద్రము కంటే లోతైనది – గగనము కంటే ఎత్తైనది

    మరణము కంటే బలీయము – శాశ్వతమైనది నీ ప్రేమ

     నీదు ప్రేమ నా ప్రభూ – మరువగ సాధ్యమా…. మరువగ సాధ్యమా….