నీ ప్రేమ ఎంతో ఎంతో మధురమ్ – యేసు నీప్రేమ ఎంతో ఎంతో మధురమ్ /2/

యేసయ్యా అతిమధురం – యేసయ్యా అది అతిమధురం /2/

1. తల్లికుండునా ఈ ప్రేమ – సోంత చేల్లికుండునా ఈ ప్రేమ 

అన్నకుండునా నీ ప్రేమ – కన్నా తండ్రికుండునా నీ ప్రేమ

  1. శిలువ కెక్కెను నీ ప్రేమ – నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ

మరణించెను నీ ప్రేమ – నాకై తిరిగి లేచెను నీ ప్రేమ

  1. మార్పులేనిది నీ ప్రేమ – నన్ను మార్చుకున్నది నీ ప్రేమ

బలమున్నది నీ ప్రేమలో – గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో