పల్లవి: నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం  

నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం – నీ శిలువలోనే

1. నా కనుపాపగా నీవున్నావని – నా మదిలోని మమతవు నీవని 

నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని 

నిరతం కొలుతును ఇల నిను దేవా 

నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే… 

2. సర్వ లోకాల పాపాలు మోయ – స్వామీ నీవే బలి అయితివే 

సమర్పింతు తండ్రి నా హృదయమును –  సమర్పింతు తండ్రి నా హృదయమును

సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా – సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా

నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం  

నీ శిలువలోనే నాముక్తీ – నీ నీడలోనే నా జీవితం – నీ శిలువలోనే