Neethimaalina naakai song Lyrics నీతిమాలిన నాకై నీతిమంతుని ప్రాణ త్యాగం అపవిత్రుడైన నాకై పవిత్ర దేవుని రక్తార్పణం అర్హత లేని నాకై పరలోక పౌరసత్వం నాకోసమే నీకోసమే ఈ ప్రాణ బలియాగం నాకోసమే నీకోసమే ఈ సిలువ యాగము 1. పదివేలలో గుర్తింపదగిన – అతి సుందరుడు ఆ ప్రియుడు /2/ సురుపమైన సొగసైన లేక – వ్యసనాక్రాంతుడు గా మారెను/2/నా/ 2. జీవ జలములు త్రాగిత్తునని వాగ్ధానము నిచ్చిన ఆ ప్రియుడు /2/ వేదనతో రోదనతో సిలువలో దాహము పొందెను /2/నా/ 3. పాపికై క్రయధనం చెల్లించుటకై – దౌర్జన్యంనొంది బాధింపబడెను కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటము – నోరు తెరువక భరియించెను /2/నా/ Credentials: Lyrics, Tune and Voice: Paul Emmanuel Music: Paul Prasanth Album: Nee Nirnayam Lent Meditational sond indexLent songs index Watch this song below: