Neeve Krupaadhaaramu / Hosanna ministries 2020 new year song Click here for this song chords నీవే కృపాధారముత్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా /2/ నూతన బలమును నవ నూతన కృపను /2/ నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా .. /నీవే/ 1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను /2/ ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి /2/ ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా /2/నీవే/ 2. సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి /2/ సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి /2/ శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా /నీవే/ 3. ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి /2/ పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి /2/ పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకెనయా /నీవే/ Lyrics in English: Neeve krupaadhaaramu triyeka deva Neeve kshemaadhaaramu naa Yeasayya /2/ Nootana balamu nava nootana krupanu /2/ Netivaraku dayacheyuchunnavu – Ninne aaraadhintunu parishuddhudaa Ee stotra geetamu neekenayya /Neeve/ 1. Aanandinchitini anuraaga bandhaala aasrayapuramaina neelo nenu /2/ Akarshinchitivi aakaashamukante vunnatamaina nee premanu choopi /2/ Aapadalenno alamukunnanu – Abhayamu nichhitivi Aavedanala agnijwaalalo andaga nilachitivi Aalochanavai aasrayamichhi kaapaaduchunnaavu Neeke ee stotra geetam ankitamayya /2/neeve/ 2. Sarvakrupaanidhi seyonu puravaasi – nee swasthyamukai nanu pilachitivi /2/ Siluvanu moyuchu nee chittamunu neraverchedanu – Sahanamukaligi /2/ Sidhilamukaani sampadalenno naakai daachitivi Saahasamaina goppa kaaryamulu naakai chesitivi Sarvasakthigala devudavai nadipinchuchunnavu Ninne aaraadintunu Parishuddhudaa – Ee Stotra geetamu neekenayya /ninne/ 3. Praakaaramulanu daatinchitivi – Praardhanavinedi paavana moorthivi /2/ Parishudhhulato nano nilipitivi – nee kaaryamulanu nootana parachi /2/ Paavanamaina jeevanayaatralo vijayamu nichhitivi Parama raajyamulo niluputakoraku abhishekinchitivi Paavanudaa naa adugulu jaaraka sthiraparachinaavu Ninne aaraadintunu Parishuddhudaa – Ee Stotra geetamu neekenayya /ninne/ Credentials : Song by: Hosanna ministries 2020 new year song Sung by: Pastor John Wesley and others Watch this song on below YouTube link: Click here for more new year song lyrics