నీవే నా దేవుడవు – ఆరాధింతును

నీవే నా రాజువు – కీర్తించెదను (2)

మరణమును జయించిన – మృత్యుంజయుడవు నీవే

మరణమునుంచి జీవముకు – నను దాటించావు

పరలోకమునుండి వెలుగుగ వచ్చి – మార్గము చూపితివి

చీకటి నుంచి వెలుగనకు – నను నడిపించావు

హోసన్నా  మహిమ నీకే – హోసన్నా  ప్రభావము రాజునకే  (2)

నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)