నీవే నా ప్రాణము – నీవే నా సర్వము

నీవే నా జీవము – యేసయ్యా (2)

మరువలేను నీదు ప్రేమ – విడువలేనయా నీ స్నేహం(2)  ||నీవే||         

1. మార్గం నీవే – సత్యం జీవం నీవే

జీవించుటకు – ఆధారం నీవే (2)

అపాయం రాకుండ కాపాడువాడవు – నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||

2. తోడు నీవే – నా నీడ నీవే

నిత్యం నా తోడుండే – నా చెలిమి నీవే (2)

బ్రతుకంతా నీ కొరకే జీవింతును – నిను నేను అరాధింతున్ (2) ||నీవే||