నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు 

ఊహించలేను నా యేసయ్యా ..  /2/

1. నీదు స్వరము వినకనె నేను – నిను విడచి తిరిగితి నేను 

నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితి /2/నిను/

2. నీదివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి 

అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని /2/

ఐనా అదే ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ

నను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా //నీతో /

3. నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ 

నీ వెలుగు లోనే నిత్యం – నే నడిచెదన్ /2/ 

నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు 

నీతోనే నా బ్రతుకు సాగింతును – యేసయ్యా /నీతో /