1. ఓ ప్రార్ధన సుప్రార్ధన – నీ ప్రాభవంబున్ మరతునా ?

నా ప్రభువున్ ముఖా ముఖిన్ – నే బ్రణుతింతు నీ ప్రభన్  

 నా ప్రాణమా సుప్రార్ధనా – నీ ప్రేరణంబుఁ చేగదా 

నీ ప్రేమధార గ్రోలుదు -నో ప్రార్ధన సుప్రార్ధన

2. పిశాచి నన్ను యుక్తితో – వశంబు చేయ జూచుచో

నీ శాంతమైన దీప్తియే – నా శంకలెల్ల మానుపున్ 

నీ శక్తి నేను మరతునా – నా శైలమా నా ప్రార్ధన 

నా శోకమెల్ల దీర్చెడు – విశేషమైన ప్రార్ధన 

3. నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార  మెల్లను 

నా దేవుడేసు చెంతకు – మోదంబు గొంచుఁబోవును 

సదా శుభంబు లొందను – విధంబు జూప నీవేగా 

నా ధైర్యమిచ్చు ప్రార్ధన – సుధా సుధార ప్రార్ధన 

4. అరణ్యమైన భూమిలో – నా రమ్యమౌ పిస్గా నగం 

బు రంగుగాను నెక్కినా – చిరగృహంబు జూతును 

శరీరమున్ విదల్చినే – బరంబు బోవు వేళలో 

కరంబు నిన్ను మెచ్చెదన్ – పరేశు ధ్యాన ప్రార్ధన 

రచన : విలియమ్ వాల్ ఫోర్డ్ 

Song number: 384 (Andhra Kraistava Keerthanalu)