ఓ సంఘమా – సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా 

మెస్సయ్యను – ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా 

ఓ సంఘమా – వినుమా 

 

1. రాణి ఓఫేరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో 

వీణ వాద్య తరంగాలలో – ప్రాణేస్వరుని ప్రసన్నతతో 

ఆనంద తైలా సుగంధాభిషేకము – నొందితివే సువాసనుండా 

2. క్రీస్తే నిను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని 

స్వస్థపరచే నిర్దోషముగా – ముడత కళంకము – లేనిదిగా  

మహిమ యుక్తంబుగా – నిలువగోరె యేసువా – సహించుతావా తీర్పునాడూ 

3. చీకటిలోనుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు 

శ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలచెనని 

గుర్తించుచుంటివా క్రియలను గంటివా – సజీవముగా నున్నావా 

4. వ్యభిచారులు నరహంతకులు – పోకిరి చేష్టల డాంబికులు 

అబద్దజనకుని యాసనము – యెజిబెలు నీ మధ్య నివసించెనా –

క్రుపావరములు – ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా     

5. చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీకది మేలగును 

నులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమో

నీమనసు మార్చుకో – తొల్లిప్రెమ కూర్చుకో 

ఆసక్తితోడ రక్షణ నొందు 

6. కడపటి బూర మ్రోగగానే – కనురెప్ప పాటున మారుదువా 

వడిగా మేఘాసీనుడవై – నడియాకాసము పోగలవా 

గొర్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా – రారాజు నెదుర్కొనగలవా