ఒక క్షణమైనా నిను వీడినా  – నేనేమౌదునో తెలియదయ్యా /2/

ప్రభు నీతోడు నీనీడలో – నేనిల బ్రతుకుచున్నానయా /2/ఒక/

1. అపవాది శోధనలు నను చుట్టినా – ఇహలోక శ్రమలు ఎదురొచ్చినా /2/

ఆశ్రయమైన నీ నీడలో  – నేనిల బ్రతుకుచున్నానయా /2/ఒక/

2. కునుకక ఎన్నడు నిద్రించక నీ – కనుపాపలో కాపాడుతూ /2/

కాపరివైన నీనీడలో – నేనిల బ్రతుకుచున్నానయా /2/ఒక/