పరమ యెరుషలేమా.. పరిషుద్ధ భూషణాలతో – 

వరునికై అలంకరించి  – సిద్ధపడిన వధువు సంఘమా 

ఆమెన్ హల్లెలుయా – ఆమెన్ హల్లెలుయా  /2/

1. రెక్కల క్రింద -తన పిల్లల చేర్చుకొని 

ప్రేమతోడ పిలచిన -కోడిని పోలి 

పిలిచాడు ప్రభు నిన్ను – వెనుదియ్యకు ప్రభు నుండి /2/

2. నా గొర్రెలు నా స్వరము వింటాయి – అవి ఎన్నడు నను వెంబడిస్తాయి 

అన్నాడు ప్రభు యేసు – అనుసరించు ప్రభు యేసుని /2/

3. తన గర్భాన పుట్టిన బిడ్డను – యే తల్లైన మరచిన మరువవచ్చును 

ప్రభునిన్ను మరువడు – మరువవద్దు ప్రభు యేసుని /2/

4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో – శోధనలలో విశ్వాసం కాపాడుకో 

ప్రభువు కొరకు సిద్ధపడుమా – గొర్రెపిల్ల జీవకన్యకా /2/