పరమందున దూతలు పాడుచున్నారు ఇహమందున భక్తులారాదించుచున్నారు (2)

స్తుతియు ఘనత ప్రభావముల్ మన యేసునకే చెల్లును (2)

హల్లెలుయా ఆమెన్ – హల్లెలుయా ఆమెన్ – హల్లెలుయా ఆమెన్ (2)

1. సుందరులలో అతి సుందరుడు పదివేలలో అతి ప్రియుడు (2)

కాంక్షనీయుడు కారుణ్యమూర్తి (2)- కరుణతో మము బ్రోచెన్ (2)#పర#

2. శ్రేష్ఠులలో అతి శ్రేష్టుoడు – మన ప్రభునకు సమమెవరు (2)

చిందించే రక్తం బలినిచ్చె ప్రాణం (2)- పరమున నిను చేర్చున్ (2)#పర#

3. పరిశుద్దుడు అతి పరిశుద్దుడు – నేత్రములే అగ్ని జ్వాలలు (2)

జయించె సాతానున్ లోకమున్ గెల్చెను (2)- జయశాలిగ జేసెన్ (2)#పర#