Prabhu yesuni vadanamulo song Lyrics

ప్రభు యెసుని వదనములో – నా దేవుడు కనిపించె(2)

పాపాత్ముల బ్రోచుటకై కృపలోలికిన కలువరిలొ

పరలోకముకై చిరజీవముకై – ప్రార్ధించెను నా హృదయం (2)

1.దిశ లన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో(2)

దౌష్ట్యముతో మసలుచును- దౌర్జన్యము చేయుచును

ధన పీడనతో..మృగ వాంఛలతో- దిగజారితి చావునకు(2)

2. చెందాడితి బ్రతుకులను – దహియి౦చితి గృహములను(2)

చెరగవు నా పాపములు – తరగవు నా వేదనలు

చనిపోయినను ధర వీడినను- చల్లారవు శోకములు(2)

3. పలు మారులు వినుచుంటి-నజరేయుని నీతి కధ(2)

పరిహాసము చేసితిని-పరమార్ధమే మోసమని

పశు ప్రాయుడనై జీవించుటచే – ప్రాప్తించెను ఈ శిలువ(2)

4. కాలువరి ఆవరణములో-కరుణాత్ముని చేరువనే(2)

కనుమూసిన కాలములో- వెలుగుదఇంచిన వేళ

కనుగొంటిని నా దౌర్భాగ్యస్తితి-కనుపించెను నా బ్రతుకు(2)

5. యెసు నీ రాజ్యముతో- భువికేతె౦చెడి రోజు(2)

ఈ పాపిని క్షమియించి-జ్ఞాపకముతో బ్రోవుమని

ఇల వేడితిని, విలపించుచును- ఈడేరెను నా వినతి(2)

6. పరదైసున ఈ దినమె- నా యానందములోను(2)

పాల్గొందువు నీ వనుచు – వాగ్ధానము చెయగనె

పరలోకమే నా తుది ఊపిరిగా – పయనించితి ప్రభు కడకు(2)