ప్రార్థన వినెడి పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయా

1. శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్య బృందమునకు నేర్పితివి(2)

పరముడ నిన్ను ప్రణుతి౦చెదను – పరలోక ప్రార్థన నేర్పుమయా

2. పరమ దెవుడవని తెలిసి – కరములెత్తి జంటగ మొడ్చి(2)

శిరమును వంచి సరిగను వేడిన – సుంకరి ప్రార్థన నేర్పుమయా

3. దినములోన చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ(2)

దీనుడవయ్యా ఒంటిగ కొండను – చేసిన ప్రార్థన నేర్పుమయా

4. శత్రు మూక నిను చుట్టుకొని – శిలువపైకి నిను చంపగను(2)

శాంతముతో నీ శత్రుల బ్రోవగా – సలిపిన ప్రార్థన నేర్పుమయా