ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం 

ముదమార వసియించునా – హృదయాంతరంగమున 

1. నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును 

పవిత్ర పరచుము తండ్రీ – ప్రతి పాపమును కడిగి 

2. అజాగరూకుడనైతి – నిజాశ్రయము విడచి 

కరుణా రసముతో నాకై – కనిపెట్టితివి తండ్రి 

3. వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనె 

చేరితి నీదు దారి – కోరి నడిపించుము