Rajaadhi raaja Raa raa telugu worship song lyrics Click here for this song Chords రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా ఓ …. మేఘ వాహనంబు మీద వేగమే ఓ …. మించు వైభవంబు తోడ వేగమే 1. ఓ … భూ జనంబు లెల్ల తేరి చూడగా – ఓ …. నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు సేయ – భూ రాజులెల్ల గూలి పోవ – భూమి ఆకసంబు మారిపోవ నీ మహా ప్రభావమున వేగ 2. ఆ … ఆకసమున దూత లార్భటింపగా – ఆ … అది భక్త సంఘ సమేతంబుగా ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ – యేసు నాధ! నీదు మహిమ లోన – మాకదే మహానంద మౌగ 3. ఓ … పరమ యెరుషలేము పుణ్య సంఘమా – ఓ … గొఱ్ఱియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా – పరమ దూతలార! భక్తులారా! పౌలపోస్తులార! పెద్దలారా! గొఱ్ఱియ పిల్ల యేసు రాజు పేర – క్రొత్తగీతమెత్తి పాడ రారా Song : Rajadi Raja Ra Ra Lyricist : E.D. Nithya Nandhamu Vocals : SamuelSen Song number 236 from Andhra Kraistava Keerthanalu