Rajaadhi raaja Raa raa telugu worship song chords 

Click here for this song Lyrics

Song Key: C

Style: 6/8

C        Am  C      C           Am    C
రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
C                          Am       F       G           C
రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా
C      Am                         C
ఓ …. మేఘ వాహనంబు మీద వేగమే

C      Am                         C

ఓ …. మించు వైభవంబు తోడ వేగమే

1. ఓ … భూ జనంబు లెల్ల తేరి చూడగా – ఓ …. నీ జనంబు స్వాగతంబు నీయగా

నీ రాజ్య స్థాపనంబు సేయ – భూ రాజులెల్ల గూలి పోవ – భూమి ఆకసంబు మారిపోవ

నీ మహా ప్రభావమున వేగ

2. ఆ … ఆకసమున దూత లార్భటింపగా – ఆ … అది భక్త సంఘ సమేతంబుగా

ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ – యేసు నాధ! నీదు మహిమ లోన –  మాకదే మహానంద మౌగ

3. ఓ … పరమ యెరుషలేము పుణ్య సంఘమా – ఓ … గొఱ్ఱియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా – పరమ దూతలార!

భక్తులారా! పౌలపోస్తులార! పెద్దలారా! గొఱ్ఱియ పిల్ల యేసు రాజు పేర – క్రొత్తగీతమెత్తి పాడ రారా

Song : Rajaadhi Raja Raa Raa 
Lyricist : E.D. Nithyanandam, Vocals: Samuel Sen
Song number 236 from Andhra Kraistava Keerthanalu