పల్లవి: రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం 

సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2X)  /రండహో/

1. అలనాడు బెత్లేహేము పశుల పాకలో

కన్నియ మరియకు శిశువు పుట్టెను (2X)

గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2X) ||రండహో||

2. ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె

భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్ (2X)

అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్  (2X)

సంభ్రాలతో యిక శృతి కలపండి ||రండహో||

3. నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి 

పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2X)

యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి (2X)

సంభ్రాలతో యిక శృతికలపండి||రండహో||