సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆ … ఆ .. ఆ..

1. మోషే కంటే శ్రేష్టుడు – అన్ని మోసముల నుండి విడిపించున్ 

వేషదారులను ద్వేషించున్ – ఆశతో మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ.. (2)

2. ఆహారోను కంటే శ్రేష్టుడు – మన ఆరాధనకు పాత్రుండు 

ఆయనే ప్రధాన యాజకుడు – అందరము మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ..(2)

3. ఆలయము కన్న శ్రేష్టుడు – నిజ ఆలయముగ తానే యుండెన్ 

ఆలయము మీరే అనెను – ఎల్లకాలము మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ..(2)

4. యోనా కంటే శ్రేష్టుడు – ప్రాణ దానముగా తన్ను అర్పించేన్ 

మానవులను విమోచించెన్ – ఘనపరచి మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ..(2)

5. సోలోమోను కన్నా శ్రేష్టుడు – సర్వ జ్ఞానమునకు ఆధారుండు 

పదివేలలో అతి ప్రియుండు – పదిలముగా మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ..(2)

6. రాజులకంటే శ్రేష్టుడు – యాజకులనుగా మనలను జేసెన్ 

రారాజుగ త్వరలో వచ్చున్ – రయముగాను మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ..(2)

7. అందరిలో అతి శ్రేష్టుడు – మన కందరికీ తానే ప్రభువు 

హల్లెలూయకు పాత్రుండు – అనుదినము మ్రొక్కెదము ఆ … ఆ .. ఆ..(2)