సాక్ష్యమిఛెద మన స్వామి యేసు దేవుడంచు – 

సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయె 

1. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను – స్వామి రక్షించెనంచు 

1. దిక్కు దెసయు లేనినన్ను – దేవుడెంతో కనికరించి 

మక్కువతో నాకు నెట్లు – మన శాంతి నిచ్చినాడో 

2. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు 

పిల్లలకును బెద్దలకును – బ్రేమతో నా స్వానుభవము 

3. బోధ చేయలేను వాద -ములకు బోను నాకదేల 

నాదుడేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసి నంతవరకు 

4. పాపులకును మిత్రుడంచు – బ్రాణమొసగి లేచెనంచు 

బావముల క్షమించునంచు – బ్రభుని విశ్వసించుడంచు 

5. చోరులైన జారుల నాచారులైన నెవ్వరైన

 ఘోరపాపు లైన క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు 

6. పరమత దూషణము లేల – పరిహసించి పలుకుటేల 

ఇరుగు పొరుగు వారికెల్ల – యేసు క్రీస్తు దేవుడంచు 

7. ఎల్లకాల మూరకుండ – నేల యాత్మ శాంతి లేక 

తల్లడిల్లు వారలకును – తండ్రి కుమారాత్మ పేర