సమర్పణ చేయుము ప్రభువునకు – నీ దేహము ధనము సమయమును 

1. అబ్రామును అడిగెను ప్రభువపుడు – ఇస్సాకును అర్పణ ఇమ్మనెను 

నీ బిడ్డను సేవకు నిచ్చెదవా – నీ విచ్చెదవా #సమర్పణ#

2. ప్రియము దేవునికి హేబేలు బలి – హేయము కయినుని అర్పణము 

కళంకము కల్మషమంటనివి – నీ విచ్చెదవా #సమర్పణ#

3. అయిదు రొట్టెలు చేపలు రెండు – అయిదు వేలకు ఆహారముగా 

అర్పించెనా బాలుడా కటి వేళ – అట్లిచ్చెదవా #సమర్పణ#

4. ప్రభుని ప్రేమించిన పేదరాలు – కాసులు రెండిచ్చెను కానుకగా 

జీవనమంతయు దేవునికిచ్చెన్ – నీవిచ్చెదవా #సమర్పణ#

5. నీ దేహము దేవుని ఆలయము – నీ దేవుడు మలచిన మందిరము 

సజీవ యాగముగా నీ విచ్చెదవా – నీ విచ్చెదవా #సమర్పణ#