Sarva krupanidhi yagu prabhuvaa song lyrics

1. సర్వకృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా 

స్తోత్రము చేసి స్తుతించెదము – సంతోషముగ నిను పొగడెదము

పల్లవి:  హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయా 

హల్లెలూయ యని పాడెదను – ఆనందముతో సాగెదను

2. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నను రక్షించితివి

పరిశుద్దముగ జీవించుటకై – పాపిని నను కరుణించితివి /హల్లెలూయ/

3. మరణ శరీరము మార్పు నొంది – మహిమ శరీరము పొందుటకై

మహిమాత్మతో నను నింపితివి – మరణ భయములను తీర్చితివి  /హల్లెలూయ/