సర్వ కృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా

స్తోత్రము చేసి స్తుతి౦చెదను – సంతసముగ నిన్ను పొగడేదను (2)

హల్లెలూయ – హల్లెలూయ(2)

హల్లెలూయ యని పాడేదను- ఆనందముతో సాగెదను

1. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతీతో నను రక్షించితీవి(2)

పరి శుద్దముగ జీవించుటకై- పాపిని నను కరుణించితీవి (2)#హల్లె#

2. అల్ప కాల శ్రమలనుభవింప – అనుదినము కృప నిచ్చితివి(2)

నాధుని అడుగు జాడలలో – నడచుటకై నను పిలచీతీవి(2)#హల్లె#

3. మరణ శరీరము మార్పు నొ౦ది – మహిమ శరీరము పొందుటకై(2)

మహిమాత్మతో నను నింపితీవీ- మరణ భయములను దీర్చితీవి(2)#హల్లె#

4. ఎవరూ పాడని గీతమును – యేసుతో నేను పాడుటకై(2)

హేతువు లేకయే ప్రేమించెన్ – యేసుకు నేనే మివ్వగలన్ (2)#హల్లె#