Siluve naa saranaayenu ra Song lyrics

సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /

1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా  /నీ సిలువే /

2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /

3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /

4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /

5. శరణు యేసు శరణు శరణు – శరణు  శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /

రచన: చెట్టి భానుమూర్తి
తాళం: ఆది తాళం
రాగం: కురంజి
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు : 198

Lyrics in English:

Siluve naa saranaayenu ra – nee – siluve naa sara naayenuraa – Siluva yande mukti balamun – joochiti raa /nee siluve/

1. Siluvanu vraali Yesu – Palikina palukulandu – Viluvaleni premaamrutamun groliti raa /nee siluve/

2. Siluvanu joochukoladi – Silasamaanamaina manasu = Naligi karigi neeraguchunnadiraa.. /nee siluve/

3. Siluvanu darachi tarachiti – Viluva kandaga raani nee krupa = Kalushamellanu baapaga jaalunu raa /Nee siluve/

4. Palu vidha padhamu larasi – Phalitamemi gaana leka = Siluva yedutanu nilachinaadanu raa / Nee siluve/

5. Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuva = Durita dooruda nee dari jeriti rua / Nee siluve/

Lyrics: Chetti Bhanu moorthi
Taalam: Aadi
Raagam: Kunjira
Andhra Kraistava Keerthanalu: song 198