Snehitudu Prana priyudu song lyrics

స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు (2)

నా సమీప బంధువుడు – దీన పాపి బాంధవుడు (2)

వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా#స్నేహితుడు#

1. తోడూ నీడ లేని నను చూడ వచ్చెను – జాడలు వెదకి జాలి చూపెను (2) 

పాడైన బ్రతుకును బాగు చేసెను – ఎండిన మోడులే చిగురించెను (2)

వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా #స్నేహితుడు#

2. దాహము కోరి నే దూరమరిగితి – మరణపు మారా దాపురించెను (2)

క్రీస్తే జీవం మధురమాయెను – క్షీర ద్రాక్షలు సెదదీర్చెను (2)

వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా #స్నేహితుడు#

3. బాధలలో నన్ను ఆదరించెను – శోధనలందు తోడు నిల్చెను(2) 

నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను(2)

వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా #స్నేహితుడు#