పల్లవి: శ్రీ యేసు గీతి పాడవా – ఆ సిల్వ ప్రేమ చాటవా (2X)

జనులెందరో – నశించు చుండగా (2X)

సువార్త చాట కుందువా – నాకేమిలే అందువా (2X)

1. ప్రభు ప్రేమను – రుచి చూచియు -మరి ఎవ్వరికి పంచవా 

పరలోకపు – మార్గంబును -పరులేవ్వరికి చూపవా (2X) /సువార్త/

2. ప్రతి వారికి- ప్రభు వార్తను – ప్రకటింప సంసిద్దమా 

పరిశుద్దుడే – నిను పంపగా – నీకింక నిర్లక్ష్యమా (2X) /సువార్త/