Hosanna Ministries New Year song 2022

Stutipaadutake batikinchina song lyrics

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

స్తుతిపాడుటకే బ్రతికించిన…

జీవన దాతవు నీవెనయా…

ఇన్నాళ్లుగ నను పోషించిన…

తల్లివలె నను ఓదార్చిన…

నీ ప్రేమనాపై ఎన్నడు మారదు యేసయ్యా //2//

జీవితకాలమంతా – ఆధారమ్ నీవేనయ్యా

నాజీవితకాలమంతా – ఆరాధించి ఘనపరతును…

స్తుతిపాడుటకే బ్రతికించిన…

జీవన దాతవు నీవెనయా…

1. ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు

సర్వజనులలో నీమహిమ వివరింప – దీర్గాయువుతో నను నింపినావు //2//

నీకృపా బాహుళ్యమే వీడని అనుబంధమై

తలచిన ప్రతిక్షణమున – నూతన బలమిచ్చెను //స్తుతి//

2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఃఖదినములు

కృపలను పొంది నీకాడిమోయుటకు – లోకములోనుండి ఏర్పరచినావు //2//

నీదివ్య సంకల్పమే – అవనిలో శుభప్రదమై

నీ నిత్య రాజ్యమునకై – నిరీక్షణ కలిగించెను //స్తుతి//

3.హేతువులేకయె ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు

కలవరమొందిన వేళలయందు – నాచేయి విడువక నడిపించినావు //2///

నీప్రేమ మాధుర్యమే – నానోట స్తుతిగానమై

నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై //స్తుతి//

Lyrics in English:

Stutipaadutake batikinchina…

Jeevana daatavu neevenayya..

Innaalluga nanu poshinchina..

Tallivale nanu odaarchina..

Nee prema naapai ennadu maaradu yesayya.. //2//

Jeevitakaalamanta – aadhaaram neevenayya..

Naa jeevitakaalamanta – aaraadhinchi ghanaparatunu..

Stutipaadutake batikinchina…

Jeevana daatavu neevenayya..

1.Praanabhayamulanu tolaginchinaavu – praakaaramulanu sthaapinchinaavu

Sarvajanulalo neemahima vivarimpa – deerghaayuvuto nanu nimpinaavu //2//

Nee krupa baahulyame veedani anubandhamai

Talachina pratikshanamuna – nootana balamichhenu //Stuti//

2.Naapai vudayinche nee mahima kiranaalu – Kanumarugaayenu naa dukhadinamulu

Krupalanupondi nee kaadi moyutaku – Lokamulonundi yerparachinaavu //2//

Nee divya sankalpame – Avanilo subhapradamai

Nee nitya raajyamunakai – nereekshana kaliginchenu //stuti//

3.Hetuvulekaye preminchinaavu – Vedukaga ila nanu maarchinaavu

Kalavaramondina velalayandu – naa cheyi viduvaka nadipinchinaavu //2//

Nee prema maadhuryame – naa nota stutigaanami

Nilichina pratisthalamuna paarenu selayerulai //stuti//

Credits:

Produced by : Hosanna Ministries New Year song 2022

Sung by:  Pastor John Wesley, Pastor Abraham, Pastor Ramesh

Watch this song on below YouTube link: