స్తుతియించెదం స్తుతియించెదం సతతము నిన్నే స్తుతియించెదం

కొనియాడెదం కొనియాడెదం నీ కృప తలచి కొనియాడెదం

స్తుతులకు పాత్రుడా స్తుతులపై ఆసీనుడా 

సేవించెదమ్ పూజించెదమ్ స్తుతియించెదమ్ ఘనపరచెదమ్ /2/

1. దావీదు స్తుతులను పాడ అభిషేకమే దిగి రాగ 

నీ నామమునకే మహిమ ఘనత /2/

మా స్తుతి స్తోత్రముల్ నీకె చెల్లును మాదేవా 

ఘనమగు కార్యములకై ఎదురు చూచు చున్నామయ్యా

మా స్తుతి గైకొనుమా /సెవించెదమ్/

2. రాజులకు రాజువు నీవు – తరతరములకు దేవుడవు

ఘనత ప్రభావము కలుగును నీకే /2/ 

నీ కృప నీదయ మాపై చూపుము ఓ దేవా 

బలమగు అభిషేకము మాకు దయచేయుమో దేవా 

మాస్తుతి గైకోనుమా /సెవించెదమ్/