Unnatamaina Prema Song Lyrics

పల్లవి: ఉన్నతమైన ప్రేమ – అత్యున్నతమైన ప్రేమ

శాశ్వతమైన ప్రేమ – పరిపూర్ణమైన ప్రేమ

యేసుని ప్రేమా – ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా

1. నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా

నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2X)

మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2X)

ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా /ఉన్నత/

2. నీదు ప్రేమ నాకు జీవం – నా సమస్తమును

నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2X)

నీవు కార్చిన రక్తమే నా –  ముక్తి మార్గమై (2X)

ఆ కలువరి ప్రేమ – ఆ కలువరి ప్రేమా /ఉన్నత/