ఉత్సాహ గానము చేసెదము – ఘన పరచెదము మన యేసయ్య నామమును /2/

హల్లెలూయ యెహోవ రాఫా – హల్లెలూయ యెహోవ షమ్మా 

హల్లెలూయ యెహోవ ఈరే – హల్లెలూయ యెహోవ షాలోమ్ /2/

1. అమూల్యములైన వాగ్ధానములు – అత్యధికముగా ఉన్నవి /2/

వాటిని మనము నమ్మిన యెడల – దేవుని మహిమను అనుభవించెదము /2/హల్లె/

2. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్ని వాగ్ధాన ఫలములెగా 

అత్మాభిషేకము సమృద్ధిగా పొంది – ఆత్మీయ వరములు అనుభవించెదము /2/హల్లె/

3. వాగ్ధాన దేశము పితరులకిచ్చిన – నమ్మదగిన దేవుడాయన /2/

జయించిన వారమై అర్హతపొంది – నూతన యెరుషలెమ్ అనుభవించెదము /2/హల్లె/