Vachhindi Vachhindi Telugu Marriage song lyrics

వచ్చింది వచ్చింది మధురమైన సమయం 

తెచ్చింది నూతన కాంతుల ఉదయం 

రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం 

నీకోసమే ఈ స్వాగత గీతం 

  1. మల్లెలు పరిమళం చల్లినవేళ

అల్లరి తెమ్మెర తాకినవేళ /2/

వెల్లువై ఆనందం పొంగిన వేళ 

మెల్లగ నీ పాటి దరిచేరగా /2/రా/

  1. కోయిల గానాలు వినిపించువేళ

కోరిన ఘడియలు ఎదురైనవేళ /2/

చామంతులే పలకరించినవేళ 

చేయందుకొని సతిని స్వీకరించగా /2/రా/

  1. పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ

పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ /2/

మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ 

వినయముగా నీ ప్రియుని సంధించగా /2/రా/