వెండిబంగారాలకన్నా మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ

లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)

లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ (2) ||వెండి||

1. లోకమునకు వెలుగైన ప్రేమ – లోకమును వెలిగించిన ప్రేమ

లొకులకై కరిగిపోయిన ప్రేమ – లోకాన్నే జయించిన ప్రేమ

యేసు ప్రేమ శాశ్వత ప్రేమ (2) హల్లెలూయా మహాదానందమే (2)

2. యే స్తితికైనా చాలిన ప్రేమ – నీ పరిస్థితిని మార్చగల ప్రేమ

నీకు బదులు మరణించిన ప్రేమ – చీర జీవము నీకొసగే ప్రేమ (2)

 యేసు ప్రేమ శాశ్వత ప్రేమ (2) హల్లెలూయా మహాదానందమే (2)