Vivaahamannadi song lyrics

వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది /2/

1. దేహములో సగ భాగముగా – మనుగడలో సహచారిణిగా /2/

నారిగా సహకారిగ – స్త్రీని నిర్మించినాడు దేవుడు /2/వివా/

2.  ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని /2/

శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు/2/వివా/

3.దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధిపొందగా/2/ 

వేరుగా ఉన్నవారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు /2/వివా/