C          F                                   G       

ఏ పాప మెరుగని యోపావన మూర్తి – పాప విమోచకుండ

Am      F                                                         C                   

= నా పాలి దైవమా – నా పాపముల కొర – కీ పాట్లు నొందినావా 

  1. ముళ్ళతోగేరీట- మల్లినీశిరముపై – జల్లాటమునమొత్తిరా = ముళ్ళపోట్లకుశిరము – తల్లడిల్లగసోమ్మ – సిల్లిపోతివరక్షకా

  2. కలువరిగిరిదనుక – సిలువమోయలేక – కలవరమునొందినావా = శిలువనీతోమోయ – తులువలువేరొకని – దోడుగానిచ్చినారా

  3. చెడుగుయూదులుబెట్టు – పడరానిపాట్లకు – సుడివడినడచినావా = కడకుకల్వరిగిరి – కడకేగిసిల్వను – గ్రక్కునదించినావ

  4. ఆకాలకర్ములు – భీకరంబుగానిన్నుఆకొయ్యపైనుంచిరా = నీకాలుసేతులు – ఆకొయ్యకేసూదిమేకులతొగ్రుచ్చినారా

  5. పలువిధంబులశ్రమలు – చెలరేగదండ్రికి – నెలుగెత్తిమొరలిడితివా = సిలువపైబలుమారు – కలుగుచుండెడిబాధ – వలనదాహమునాయెనా

  6. బల్లిదుండగుబంటు – బల్లెముననీప్రక్క – జిల్లిబడబొడచినాడా = ఉల్లోలములవలెనల్లనీరుబుకంగ – జల్లారెగదకోపము

7. కటకటా పాప సం – కటము బాపుట కింత – పటుబాధ నొందినావా = ఎటువంటి దీ ప్రేమ – ఎటువంటి దీ శాంత – మెటుల వర్ణింతు స్వామి