యెహోవ నా మొర లాలించెను – దన మహా దయను నను గణించెను 

అహర్నిశల దీన హీనుడగు నా – దుహాయనెడు ద్వ్హని గ్రహించి మనిపెను 

1. పిశాచి కడిమి బడగొట్టెను -దన వశాన ననునిలువబెట్టెను

ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల – నిశాంతమున జేర్చి సేద దీర్చెను 

2.  మదావళము బోలు నా మదిన్ – దన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్ 

యధేచ్చలన్నిటి – గుదించి పాపపు – మొదల్  తుదల్ నరికి దరికి జేర్చెను 

3. అనీతి వస్త్రమోడలించెను – యేసు నాదు రక్తమున ముంచెను 

వినూత్న యత్నమె – దనూని యెన్నడు – గనన్ వినన్ బ్రే- మనాకు జూపెను 

4. విలాపములకు జెవి నిచ్చెను – శ్రమ కలాపములకు  సెలవిచ్చెను 

శిలాగనము పైకి లాగి నను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను 

5. అగణ్య పాపియని త్రోయక – నన్ను గూర్చి తన సుతుని దాచక 

తెగించి మృతి కో-ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను