యెహొవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి(2)

కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)

1. నాకము వర్షించినా – లోకము నశించినా(2)

మీకు అండగా నిలచిన విభునకు(2)

కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)

2. కరువులు కలిగిననూ – మరణము వచ్చినను(2)

కరుణతో కొరతలను – తీర్చిన ప్రభునకు(2)

కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)

3. అపదలె రాని – అప నిందలే గాని(2)

కాపరియై మమ్ము – గాచిన క్రీస్తుకు(2)

కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)