Yento vinta yento china Song Lyrics (Siluva dhyanamulu)
ఎంతో వింత ఎంతో చింత – యేసు నాధు మరణ మంత = పంతముతో జేసి రంత – సోంత ప్రజలు స్వామి నంత /ఎంతో/
-
పట్టి కట్టి నెట్టి కొట్టి – తిట్టి రేసు నాధు నకటా = అట్టి శ్రమల నొంది పలుక -డాయె యేసు స్వామి నాడు ॥ఎంతో॥
-
మొయ్యలేని మ్రాను నొకటి – మోపి రేసు వీపు పైని = మొయ్యలేక మ్రానితోడ – మూర్చబోయె నేసు తండ్రి ॥ఎంతో॥
-
కొయ్యపై నేసయ్యన్ బెట్టి – కాలుసేతులలో జీలల్ = కఠిను లంత గూడి కొట్టిరి – ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ॥ఎంతో॥
-
దాహముగొన జేదు చిరక – ద్రావ నిడిరి ద్రోహులకటా = ధాత్రి ప్రజల బాధ కోర్చి – ధన్యుడా దివి కేగె నహహా ॥ఎంతో॥
-
బల్లెముతో బ్రక్కన్ బోడవన్ – పారె నీరు రక్త మహహా = ఏరై పారె యేసు రక్త – మెల్ల ప్రజల కెలమి నొసగు ॥ఎంతో॥