Yesayya ne prema na sontamu song lyrics

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము //2//

యేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము

ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము

ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం //యేసయ్య//

1. ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు

నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు

నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు

నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం

నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి – నీలోనే తరియించీ

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము

యేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము

2. ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు

లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే

నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా

పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం

సాటే లేరు నీకు – సర్వాథికారివి నీవు

మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు//యేసయ్య//

​Lyrics in English:

Yesayya nee prema na sontamu – Nalona palikina stutigeetamu //2//

Yesayya neevega tolikiranamu – Naalona veligina ravikiranamu

Yenaadu aarani na deepamu – Naa jeevitaaniki aadhaaramu

Emmanuyeluga nee snehamu – Naalona nityamu oka sambaram //Yesayya//

1. Yepaati nannu preminchinaavu – Nee premalone nanu daachinaavu

Na bhaaramanta nuvu mosinaavu – nannentagaano hechhinchinaavu

Nee krupalone nanu kaachinaavu – Nee kanikarame choopinchinaavu

Naa hrudilone nee vaakyadhyaanam – Na madilone nee naamasmaranam

Ninne araadhinchi – nee dayalone jeevinchi ninne ne poojinchi – neelone tariyinchi..

Yesayya nee prema na sontamu – Nalona palikina stutigeetamu

Yesayya neevega tolikiranamu – Naalona veligina ravikiranamu

2. Yenaadu nannu vidanaadaledu – Nee needalone nadipinchinavu

Lokaalanele raaraajuneeve – Na jeevanaavaku rahadaari neeve

Na gurineeve na Yesu deva – Cheriti ninne naa praana naadha

Parvatasikharam nee mahima dwaaram – Vunnatamainadi nee divya charitam

Sate leru neeku – Sarvaadhikaarivi neevu

Maarani daivam neevu – Mahimonnatudavu neevu… //Yesayya//

Credits :
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Javed Ali

Click below to watch this song on YouTube: