నీవుంటే నాకు చాలు యేసయ్య – నీ వెంటే నేను ఉంటా యేసయ్య (2)

నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య

నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2)

1. ఎన్ని బాధలున్నను – ఇబ్బందులైనను

    ఎంత కష్టమొచ్చినా – నిష్టూరమైనను(2)#నీవుంటే#

2. బ్రతుకు నావ పగిలినా – కడలి పాలైనను

     అలలు ముంచివేసిన – ఆశలు అణగారిన (2)#నీవుంటే#

3. ఆస్తులన్ని పోయినా – అనాధగా మిగిలినా

     ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా (2)#నీవుంటే#

4. నీకు ఇలలో ఎదియు – కాదు అసాధ్యము

     నీదు కృపతో నాకేదియు – కాదిల సమానము(2)#నీవుంటే#