Rajaadhi raaja Raa raa telugu worship song lyrics

Click here for this song Chords

రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా 

రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా 

ఓ …. మేఘ వాహనంబు మీద వేగమే 

ఓ …. మించు వైభవంబు తోడ వేగమే 

1. ఓ … భూ జనంబు లెల్ల తేరి చూడగా – ఓ …. నీ జనంబు స్వాగతంబు నీయగా 

నీ రాజ్య స్థాపనంబు సేయ – భూ రాజులెల్ల గూలి పోవ – భూమి ఆకసంబు మారిపోవ 

నీ మహా ప్రభావమున వేగ 

2. ఆ … ఆకసమున దూత లార్భటింపగా – ఆ … అది భక్త సంఘ సమేతంబుగా 

ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ – యేసు నాధ! నీదు మహిమ లోన –  మాకదే మహానంద మౌగ 

3. ఓ … పరమ యెరుషలేము పుణ్య సంఘమా – ఓ … గొఱ్ఱియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా – పరమ

దూతలార! భక్తులారా! పౌలపోస్తులార! పెద్దలారా! గొఱ్ఱియ పిల్ల యేసు రాజు పేర – క్రొత్తగీతమెత్తి పాడ రారా 

Song : Rajadi Raja Ra Ra
Lyricist : E.D. Nithya Nandhamu
Vocals : SamuelSen
Song number 236 from Andhra Kraistava Keerthanalu